![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం వైల్డ్ కార్డ్స్ ద్వారా ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు యంగ్ స్టార్స్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో.. అయేషా రెడీ అవుతుంటే ఇమ్ము తన దగ్గరికి వెళ్లి.. మీరు బాగున్నారు మేకప్ లేకుండా కూడా చాలా క్యూట్ ఉన్నారని అంటాడు. తనూజ కూడా మేకప్ లేకుండా క్యూట్ ఉంటుందని అయేషా అంటుంది. హా ఉంటుందని కాస్త డౌట్ గా చెప్తాడు ఇమ్మాన్యుయల్.
ఆ తర్వాత కాసేపటికి సంజన, ఇమ్ము మాట్లాడుకుంటుంటే తనూజ వస్తుంది. ఇందాక ఏం అంటున్నావ్.. బాగుంటానని క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతున్నావని ఇమ్మాన్యుయల్ ని కొడుతుంది. ఇప్పటివరకు ఒక్కతే కోడలు ఉందని చాలా బిల్డప్ ఇచ్చింది.. ఇప్పుడు ఇంకొక కోడలు వచ్చింది.. ఇక నుండి 2.0 అని ఇమ్ముతో సంజన అంటుంది. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో రీతూ బట్టలు పిండేస్తుంది. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే తప్ప ఫేస్ కాస్ట్లీ గా కనిపించడం లేదని రీతూని ఉద్దేశించి ఇమ్ము అంటాడు.
బిగ్ బాస్ చాలా థాంక్స్.. నా కోరిక తీర్చావ్.. వైల్డ్ కార్డ్స్ అంటే ఇలా ఉండాలి అని అయేషా, రమ్య చీర కట్టుకొని వస్తుంటే ఒక పాట పాడతాడు. అది చూసి రీతూ కుళ్ళుకుంటుంది. వైల్డ్ కార్డ్స్ బాగున్నారని ఇమ్ము అంటుంటే మిగతా వాళ్ళు బాలేరా అని రమ్య అడుగుతుంది. ఒకసారి వెనకాల చూడమని బట్టలు పిండేస్తున్న రీతూని చూపిస్తాడు ఇమ్మాన్యుయల్. రీతూ చౌదరి, తనూజ వైల్డ్ కార్డ్స్ ని చూసి కుళ్ళుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
![]() |
![]() |